నేను ఏ పార్టీకి మద్దతు తెలపను

Aamir Khan
Aamir Khan

ముంబయి: బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌ తన 54వ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన తన పుట్టిన రోజును ఎప్పటిలాగేబంద్రాలోని తన నివాసంలో భార్య కిరణ్ రావ్, అభిమానులు, మీడియా సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో అందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో వారు ఇక్కడికి వచ్చి ఓటు వేయలేరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈసీని కోరారు. ఈ సందర్భంగా మీరు బిజెపి కి మద్దతు తెలుపుతారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తాను ఏ పార్టీకి మద్దతు తెలపను అని అమీర్‌ఖాన్ సమాధానమిచ్చారు.


మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/