అభిమానికి క్యాన్సర్.. వెంకీ పరామర్శ

అభిమానుల కోసం మానవత్వం

Hero Venkatesh Met his Fan
Hero Venkatesh Met his Fan

వెంకటేష్  .. అభిమానుల కోసం మానవత్వంతో స్పందించే స్వభావం ఆయనలో మెండు. తాజాగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమానిని పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఎల్.బి.నగర్ కి చెందిన తన అభిమాన సంఘానికి ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్న సురేష్ లివర్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. పూర్తిగా చిక్కి శల్యమైన దశలో అతడికి ఇంకా ఖరీదైన ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. సురేష్ – వెంకీకి వీరాభిమాని. తన అభిమాని వేగంగా కోలుకోవాలని వెంకీ ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారట.   వెంకీ మామ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతోంది. ఈ సినిమా షూటింగ్ లో వెంకీ చాలా బిజీగా ఉన్నారు. చిన్న గ్యాప్ లో ఇలా తన అభిమానిని పరామర్శించి ధైర్యం చెప్పారు