వెబ్‌ సిరీస్‌లపై మోజు

Hebah Patel

వెబ్‌సిరీస్‌లపై ఇపుడు స్టార్స్‌, సూపర్‌స్టార్స్‌ కూడ వెబ్‌సిరీస్‌లపై ఆసక్తి చూపుతన్నారు. సినిమాలస్థాయిలో వెబ్‌ సిరీస్‌లను చేస్తున్నారు.. దాంతో స్టార్లు కూడ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.. ఇక సినిమాల్లో ఛాన్స్‌ లేని హీరోయిన్లు, నటులకు వెబ్‌సిరీస్‌లు ఒక వరంగా మారాయి.. పలువురు హీరోయిన్లు వెబ్‌సిరీస్‌ బాటపడున్నారు.
వీరి జాబితాలో ముద్దుగుమ్మ హెబ్బాపటేల్‌ కూడ చేరింది.. కుమారి 21ఎఫ్‌ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినా కూడ పెద్దగా సక్సెస్‌లు దక్కించుకోలేకపోయింది.. అడపా దడపా చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం నితిన్‌ చిత్రంలో నటిస్తోంది.. ఒకవైపు హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు వెబ్‌సిరీస్‌ను చేసేందుకు కమిట్‌ అయ్యింది.. అజ§్‌ు భుయాన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న వెబ్‌సిరీస్‌తో హెబ్బాపటేల్‌ తన కొత్త జర్నీని ప్రారంభించబోతోంది..

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/