ఫిబ్ర‌వ‌రిలో ‘నేను లేను’

Harshith
Harshith

నూతన ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ దర్శకత్వంలో ఓ.య‌స్‌.యం విజన్ – దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నేను లేను’ `లాస్ట్ ఇన్ లవ్` అనేది ఉప‌శీర్షిక‌. ఈ చిత్రంలో హ‌ర్షిత్ హీరోగా నటిస్తోన్నాడు. ఇటీవ‌లే టీజర్ విడుదలై 13ల‌క్ష‌ల డిజిట‌ల్ వ్యూస్‌ను అందుకుంది. చిత్రీక‌ర‌ణ స‌హా అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. ఈ నెల 24న ట్రైల‌ర్ ను, ఫిబ్ర‌వ‌రిలో సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ – ‘ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది. ఇటివలే విడుదలైన టీజర్ కి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో తీస్తే న‌వ‌త‌రం నటీన‌టుల‌తో తీసిన సినిమా అయినా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది. ఈ నెల 24న ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసి, అటు పై ఫిబ్ర‌వ‌రిలో సినిమాను విడుదల చేస్తున్నాం. ఇప్పటివరకు భార‌త‌దేశంలో రాని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రమిద‌ని చెప్పేందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం“ అన్నారు.

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం:ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నిర్మాత : సుక్రి కుమార్.