ఇలియానా ..గ్లామరసం..

Ileana Look

ఇలియానా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా కొంత కాలం కొనసాగింది కాబట్టి తెలుగు ప్రేక్షకులకు ఇల్లీని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఈమధ్య ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తో టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చింది కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఇక్కడ డోర్లు మూసుకుపోయాయి.  ప్రస్తుతం ముంబైలోనే తన కెరీర్ సంగతి చూసుకుంటోంది. పనిలో పనిగా సోషల్ మీడియాపై కూడా ఒక కన్నేస్తూ ఉంటుంది
ఇలియానా కూడా ఇన్స్టాలో యాక్టివ్ గా ఉంటుంది.  ఇలియానా ఇన్స్టా ఖాతాను 11.8 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారంటేనే మనం ఇల్లీ బేబీ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.  తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు “మీరు నా బిల్స్ కడుతూ.. నాకు చికెన్ నగ్గీస్ తినిపిస్తూ ఉండకపోతే నేనేం చెయ్యాలో సలహాలు ఇవ్వకండి” అంటూ ఓ ఫసాక్ అనిపించే ప్రాక్టికల్ క్యాప్షన్ ఇచ్చింది. ఇండియన్ సొసైటీలో అన్నిటికంటే ఫ్రీగా లభించేవి సలహాలు..  తన  జీవితంలో ఎలా ఉండాలో తనకు తెలియకపోయినా పక్కవాడు ఎలా ఉండాలో.. ఏం చెయ్యాలో… ఏం డ్రెస్ వేసుకోవాలో…. ఏం తినాలో.. ఏం మాట్లాడాలో..  ఏం చదవాలో మాత్రం భలేగా చెప్తుంటారు. పక్కవారికి సలహాలు ఇచ్చే సమయంలో ఉండే సూపర్ క్లారిటీ తమ జీవితంలో ఏం చేసి చావాలనే విషయంలో వీరికి అస్సలు ఉండదు.  ఇల్లీకి ఇలానే ఎవరో పిచ్చ సలహాలు ఇచ్చి ఉంటారు. గోవా పాప కదా.. ఇరిటేట్ అయి ఇలాంటి మెసేజ్ పెట్టింది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/