26న రష్మిక మందన ‘గీతా ..చల్‌’

Geetah chal Releasing on 26th April
GEETA CHAL TEAM

ఛలో,. గీత గోవిందం..దేవదాస్‌ చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌ విజయాలు అందకుంది రష్మిక మందన.. ప్రస్తుతం మరోక్రేజీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. రష్మిక నటించిన తాజా చిత్రం గీతా.. చలో ఈనెల 26న తెలుగుప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈచిత్రాన్ని దివాకర్‌ సమర్పణలో శ్రీ రాజేశ్వరి ఫిలింస్‌, మూవీ మాక్స్‌ బ్యానర్లపై మామిడాల శ్రీనివాస్‌ , దుగ్గివలన శ్రీనివాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. సెన్సార్‌ కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాయి.. హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌లో థ్రియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.. రష్మిక మందన నటించిన మరో అద్భుత చిత్రమన్నారు.. ఏప్రిల్‌ 17న ఆడియో రిలీజ్‌ చేస్తామని, అటుపై ఏప్రిల్‌21న వైజాగ్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహిస్తామన్నారు.. ఈనెల 26న సినిమాను ప్రతిష్టాత్మకంగా రిలీజ్‌ చేస్తున్నామని తెలిపారు. యువతరం మెచ్చే అన్ని హంగులు ఉన్న క్రేజీ చిత్రమన్నారు.. వీకెండ్‌ పార్టీలు యువతరాన్ని మంచి చేస్తున్నాయా.. చెడు చేస్తున్నాయా.. అనే ఆసక్తికర పాయింట్‌ చుట్టూ కథాంశం ఉంటుందన్నారు. రష్మిక అందచందాలు, నటన మైమరపిస్తాయన్నారు. కామెడీ, రొమాన్స్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రతిదీ ఆకట్టుకుంటాయన్నారు.. సమర్పకుడు డైరెక్టర్‌ దివాకర్‌ మాట్లాడుతూ, ఈఏడాది 100 రోజులు గడిచాయని, 50 సినిమాలు రిలీజైతే సక్సెస్‌ 1శాతం మాత్రమే ఉందన్నారు. పరిశ్రమలో స్లంప్‌లో ఉందన్నారు. కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ముత్యాల రామదాసు, సురేష్‌ కొండేటి , బాలాజీ, శేష్‌ తదితరులు పాల్గొన్నారు.