రూ.100కోట్ల పారితోషికంతో టాప్‌లో అక్షయ్‌!

Akshay Kumar'
Akshay Kumar’

ముంబయి: సెలబ్రిటీలకు పాపులారిటీని బట్టి వారి పారితోషికాలు ఉంటాయి. అయితే ఇది సినిమాలకే కాదు. వారు టీవీ కమర్షియల్స్‌, బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించడానికి తీసుకునే పారితోషికం చాలా ఉంటుంది. ఈ క్రమంలో అలా యాడ్‌ ఫిలింస్‌, కమర్షియల్స్‌కు అత్యధిక పారితోషికం తీసుకునేవారిలో బాలీవుడ్‌ అక్షయ్‌ కుమార్‌ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన చేతిలో రూ.100 కోట్లు విలువ చేసే కమర్షియల్స్‌ ఒప్పందాలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో రణ్‌వీర్‌ సింగ్‌ (రూ.84 కోట్లు), మూడో స్థానంలో ఆయన సతీమణి దీపిక పదుకొణె (రూ.75 కోట్లు) ఉన్నారు.


టాప్‌ 10లో మిగతా సెలబ్రిటీలు వీరే..


4. అమితాబ్ బచ్చన్‌ (రూ.72 కోట్లు)
5. ఆలియా భట్‌ (రూ.68 కోట్లు)
6. షారుఖ్‌ ఖాన్‌ (రూ.56 కోట్లు)
7. వరుణ్‌ ధావన్‌ (రూ.48 కోట్లు)
8. సల్మాన్‌ ఖాన్‌ (రూ. 40 కోట్లు)
9. కరీనా కపూర్‌ (రూ.32 కోట్లు)
10. కత్రినా కైఫ్‌ (రూ.30 కోట్లు)


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/