‘ఎదురీత’ టీజర్‌ విడుదల

Shravn, Kalyan Ram, Leonaa
Shravn, Kalyan Ram, Leonaa

శ్రవణ్‌ రాఘవేంద్ర హీరోగా పరిచయం
త్వరలో ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఆడియో

పలుచిత్రాల్లో విలన్‌గా నటించిన శ్రవణ్‌ రాఘవేంద్ర హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఎదురీత.. శ్రీభాగ్యలక్ష్మి ఎంటర్‌టైన్‌మెంట్‌స పతాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు.. బాలమురుగన్‌ దర్శకుడు.. లియోనా లిషో§్‌ు హీరోయిన్‌.. అరల్‌ కొరొల్లి సంగీత దర్శకుడు. డాక్టర్‌ చల్లా భాగ్యలక్ష్మి , శ్రేష్ఠ, రోల్‌ రిడా, విశ్వ, స్వామి పాటల రచయితలు.. ఈసినిమా టీజర్‌ను గురువారం ఉదయం నందమూరి కళ్యాణ్‌రామ్‌ విడుదల చేశారు.. త్వరలో ఆదిత్య మ్యూజిక్‌ ద్వారాసినిమా ఆడియో విడుదల కానుంది.. శ్రవణ్‌ రాఘవేంద్ర మాట్లాడుతూ, ఇదొక ఎమోషనల్‌ అని రియల్‌ లైఫ్‌లో తనకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని, ఈసినిమా కథ వినకముందు సినిమా చేయక ముందు తాను రెస్పాన్‌స్పిబుల్‌ ఫాదర్‌ అనుకున్నానని, కాదని ఈ సినిమా చేస్తున్నపుడు తెలిసిందన్నారు.. ఈ బిజీ లైఫ్‌లో రోజు కుదరకుపోయినా వీకెండ్‌ అయినా పిల్లలతో గడపాలని తెలుసుకున్నానని తెలిపారు.. కార్యక్రమంలో నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ, దర్శకుడు బాలమురుగన్‌, లియోన లిషో§్‌ు. జియాశర్మ, శాన్వీ మేఘన, నటుడు భద్రమ్‌తదితరులు మాట్లాడారు.