నటీ రీతుపర్ణ సేన్‌గుప్తాకు ఈడీ సమన్లు

Rituparna-Sengupta
Rituparna-Sengupta

న్యూఢిల్లీ: ప్రముఖ నటి రీతుపర్ణ సేన్‌గుప్తాకు రోజ్‌ వ్యాలీ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే పలువురికి సమన్లు జారీ చేశారు. బెంగాలీ నటుడు ప్రసేన్‌జీత్ చటర్జీ కూడా నోటీసులు అందుకున్నారు.రీతుపర్ణ పలు బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఘటోత్కచుడు సినిమాలో నటించారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/