‘దొర‌సాని` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

Dorasani Pre Release Function
Dorasani Pre Release Function

ఆనంద్ దేవరకొండ, శివాత్మక లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’. జులై 12న సినిమా విడుద‌ల‌వుతుంది. ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. దొరసాని జూక్‌ బాక్స్‌ను రాజశేఖర్‌ విడుదల చేశారు. బిగ్‌ టికెట్‌ని విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా…

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ విహారి మాట్లాడుతూ – “ఈ వేడుక‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ రావడం ఆనందంగా ఉంది. ఆనంద్ దేవ‌ర‌కొండతో ప‌నిచేయ‌డం హ్యాపీగా అనిపించింది. శివాత్మిక‌, ఆనంద్ పెర్ఫామెన్స్ మైండ్ బ్లోయింగ్‌. వారి న‌ట‌న బాగుడ‌టంతో నాకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వ‌డం సుల‌భ‌మైంది. మంచి యూనిట్‌తో ప‌నిచేశాను“ అన్నారు.

వెంక‌ట్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ – “రెండు పంవ‌త్స‌రాల నుండి గ‌మ‌నిస్తూ వ‌స్తే.. తెలుగు సినిమాల్లో ఓ గోల్డెన్ పీరియ‌డ్ అని చెప్పుకోవ‌చ్చు. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల‌ను ఆద‌రిస్తున్నారు. అలాంటి కోవలో దొర‌సాని సినిమా కూడా నిలుస్తుంది.ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

ప్రొడ్యూస‌ర్స కౌన్సిల్ అధ్య‌క్షుడు సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ – “ఆనంద్ మ‌న ఫ్యామిలీ మెంబ‌ర్‌లా కలిసిపోయే గుణుమున్న వ్య‌క్తి. త‌ను విజ‌య్ కంటే గొప్ప స్థాయికి ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. జీవిత, రాజ‌శేఖ‌ర్ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మా కుటుంబ స‌భ్యులు. శివాత్మిక‌కు దొర‌సాని రూపంలో మంచి సినిమా దొరికింది. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌. విడుద‌ల కాబోయే చిత్రాల‌న్నింటిలో ఈ చిత్రం టైటిల్‌లాగానే దొర‌సానిలా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

విజయ్‌దేవరకొండ మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఇది కేవీఆర్‌ మహేంద్ర, ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌ ఫంక్షన ఇది. సినిమా చేస్తానన్నప్పటి నుంచి నేను ఆనంద్‌తో పెద్దగా మాట్లాడలేదు. వాడి ముందు మాట్లాడాలని నేను ముందుగానే మాట్లాడుతున్నా. నేను పుట్టపర్తి హాస్టల్‌లో చదివాను. నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు అక్కడ వాడు ఫస్ట్‌ స్టాండర్డ్‌లో జాయిన అయ్యాడు. ఒక రోజు నేను సీరియస్‌గా నోట్స్‌ తీసుకుని క్లాస్లు వింటుంటే, సడనగా ఓ పిల్లగాడు మా డోర్‌ దగ్గరకు వచ్చి నిలుచుండు. వాడు ఏడుస్తూ నా వైపు వేలు పెట్టి చూపించాడు. అప్పుడు వాడి వెనుక వచ్చిన టీజర్‌ ‘వీడి బ్రదర్‌ నాలుగో తరగతిలో ఎవరమ్మా’ అని అడిగింది. నేను భయం భయంగా చూశాను. అప్పుడు ఆ టీచర్‌ ‘సరే ఈ రోజు లంచ పీరియడ్‌ వరకు ఇక్కడ కూర్చో. ఆ తర్వాత క్లాస్‌కి వచ్చెయ్‌’ అని మా టీచర్‌తో చెప్పి, మా వాడిని నా దగ్గర కూర్చోపెట్టారు. వాడు కింద నేలమీద కూర్చుని ఏదో రాసుకుంటూ ఉన్నాడు. అప్పుడప్పుడూ నన్ను చూస్తూ ఉండేవాడు. ఆ రోజు అలా వాడు ఏడుస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపించింది. అలా లంచ వరకు కూర్చోవాల్సిన వాడు మూడు రోజులు నాతోనే కూర్చున్నాడు. నా దోస్తులందరూ వీడికి దోస్తులయ్యారు. అప్పటి నుంచి నేనేం చేస్తే వాడు అది చేయడం అలవాటైపోయింది. ఆ తర్వాత ఇంజనీరింగ్‌ చదివి యుఎస్‌లో డెలాయిట్‌లో ఉద్యోగం చేశాడు. అలాంటి వాడు ఉద్యోగం మానేసి ఇండియాకు రావడం నాకు నచ్చలేదు. లేదు.. ఇక్కడ నేను పది పనులు చేస్తున్నా, రౌడీస్‌ చూసుకుంటా అని అన్నాడు. సరే రమ్మన్నాను. అలాంటి సమయంలో ఒక రోజు స్ర్కిప్ట్‌ విన్నా, సినిమా చేస్తా అన్నాడు. అది నాకు నచ్చలేదు. ‘అరె యాక్టింగ్‌ మాటలు కాదురా. సడనగా వచ్చి ఎట్ల చేస్తావు. మజాకనుకున్నావా?’ అని అన్నా. కానీ మా వాడు చాలా ఫిక్సయ్యాడు. ఇక నేనేమీ అనగలను. ‘సరే చేసుకో. ఇక నీ సినిమా గురించి నన్ను అడక్కు’ అని అన్నా. ఆ రోజు నుంచి వాడి సినిమా గురించి వాడితో నేనేమీ అడగలేదు. ఇప్పటిదాకా వాడి సినిమా గురించి అడగలేదు. ఈ సినిమా ప్యూర్‌ స్టోరీ టెల్లింగ్‌. నిజ జీవితాల మీద బేస్‌ అయింది. అందుకే ఆ కథ చాలా బావుంది. జూలై 12 ‘దొరసాని’ చాలా బావుంటుంది’’ అని చెప్పారు.

దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర మాట్లాడుతూ ‘‘నా జీవితంలో ఇది మెమరబుల్‌ డే. దానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎంతో మంది వెనక ఉండి ఇంత దూరం తీసుకొచ్చారు. ఎక్కడో చిన్నగా మొదలైన ఈ జర్నీ ఇంత దూరం రావడం నా జీవితంలో మర్చిపోలేని ఈవెంట్‌. ఈసినిమా రిలీజ్‌ అయిన తర్వాత మాట్లాడాలని ఉంది. కానీ కొన్ని విషయాలు.. దొరసాని కథ నేను దాచుకోలేని ఒక ఎమోషనే. ఏ దర్శకుడికైనా ఓ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంటుంది. అది తన జర్నీలో కొన్ని సినిమాలు చేసినప్పుడు అందులో ఓ సినిమా అయి ఉంటుంది. కానీ నాకు లక్కీగా నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఈ చిత్రమే. అది దొరసాని చిత్రమే. ఎందుకు ఈ సినిమాను డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అంటున్నానంటే, ఇలాంటి కథలు తరచుగా రాయరు. కానీ నా చిన్నప్పటి నుంచి విన్న కథలన్నీ ఎక్కడో మెదడు పొరల్లో ఉండి, నా చేత రాయించబడ్డది. ఇందులో హానెస్టీ, రియాలిటీ, పీరియాడిక్‌, ప్రాపర్‌ డైలక్ట్‌, ఫ్రెష్‌ ఫేసెస్‌ ఉంటాయి. ఇవన్నీ అచీవ్‌ చేయడానికి మేం ప్రాపర్‌ టెక్నాలజీని వాడాం. అనామోఫిక్‌ లెన్స, సింక్‌ సౌండ్‌, ప్రాపెర్‌ కెమెరా వంటివన్నీ మాకు సాయపడ్డాయి.

నిర్మాత య‌ష్ రంగినేని మాట్లాడుతూ – “చాలా సంతోషంగా, గ‌ర్వంగా ఉంది. ఈ క‌థ విన‌లేదు. మ‌హేంద్ర పంపిన స్క్రిప్ట్ చదివాను. రెండు రోజులు నిద్ర పోనేలేదు. త‌ను అంత డీటెయిల్డ్‌గా స్క్రిప్ట్ రాశాడు. మ‌ధ్యలో రాజు, దొర‌సాని మ‌ధ్య స‌న్నివేశాల‌ను యాడ్ చేద్దామ‌ని అనుకున్నాం. కానీ మ‌హేంద్ర అందుకు ఒప్పుకోలేదు. త‌న సినిమాపై అంత క్లారిటీతో ఉన్నాడు.

ఆనంద్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ – “నేను 15-22 ఏళ్ల స‌మ‌యంలో నేను క‌ల‌లు క‌న‌డానికి కూడా భ‌య‌ప‌డ్డాను. నేను బాగా చ‌దువుకుని యు.ఎస్ వెళ్లిపోయి జాబ్ చేసుకుంటూ ఉండిపోయాను. మ‌రో వైపు అన్న విజ‌య్‌, ఒక డ్రీమ‌ర్‌. ఆయ‌న జ‌ర్నీలో చాలా స్ట్ర‌గుల్స్ చూశాడు. అవ‌న్ని దాటేసి ఓ స‌క్సెస్‌ఫుల్ యాక్ట‌ర్‌గా ఎస్టాబ్లిష్ అయ్యారు. త‌న‌తో పాటు డైరెక్ట‌ర్స్‌ త‌రుణ్ భాస్క‌ర్‌, సందీప్‌, రాహుల్‌, భ‌ర‌త్ క‌మ్మ తెలుగు సినిమా బౌండ‌రీస్‌ను పెంచుతున్నారు. రియ‌లిస్టిక్ సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. ఆ లిస్టులో మ‌రో డైరెక్ట‌ర్ కె.వి.ఆర్‌.మహేంద్ర‌గారి పేరు వినొచ్చు. అందుకు ముందు సినిమా క‌థ‌లు వింటే భ‌య‌ప‌డేవాడిని. కానీ మ‌హేంద్ర‌గారు క‌థ చెప్పిన త‌ర్వాత న‌టుడిగా రాణించ‌వ‌చ్చున‌నిపించింది.

రాజశేఖర్‌ మాట్లాడుతూ సినిమా ఎలా ఉందంటే టాలెంట్‌ ఉందా? లేదా? అని చూడరు. కానీ సక్సెస్‌ ఉండాలి. నేను మా పిల్లలకు ప్లాన బీ ఉండాలని చూసుకోమన్నా. నా చివరి జీవితం వరకు ఈ సినిమా రంగంలోనే ఉంటాను. విజయ్‌ దేవరకొండ వచ్చినా, ఎవరు వచ్చినా కంపీట్‌ చేస్తూనే ఉంటాను. ఆ ధైర్యం నాకు ఆల్రెడీ ఉంది. పెద్ద పాప నాలాగే డాక్టర్‌ చదువుకుంది. అపోలోలో మెడికల్‌ సీటు తెచ్చుకుంది. బాగా నేర్చుకుని కంప్లీట్‌ చేయమని చెప్పాను. నేను యాక్టర్‌ అయినా కనీసం 2 గంటలైనా మెడిసన చదువుతూ ఉంటాను. శివాత్మిక ఈ సినిమాలో యాక్ట్‌ చేసింది. నేను వెళ్లి కష్టపడి కథను ఎంపిక చేయలేదు. నిర్మాతలను చూడలేదు. అంతా అలా కుదిరింది. మధుర శ్రీధర్‌గారి వల్లనే ఈ అవకాశం వచ్చింది. నాకు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారిలాగా, మధుర శ్రీధర్‌గారిలాగా. అవసరమైనప్పుడు శ్రీధర్‌గారు ఖర్చుపెట్టకుండా ఉండరు. ‘కల్కి’ సినిమాకు నేను ఇలా ప్రీ రిలీజ్‌ పెట్టుకోవడానికి కుదరలేదు. కానీ మధుర శ్రీధర్‌గారు చాలా బాగా చేశారు. మహేంద్రగారు నెక్స్ట్‌ సబ్జెక్ట్‌ నాతో చేస్తానని చెప్పారు. నాకెందుకో నా పిల్లల విషయంలో అసలు భయం లేదు. వాళ్లు పాసైపోతారని నమ్మకం. వాళ్ల టాలెంట్‌, వాళ్ల లక్‌ అన్నీ అయిపోతే అప్పుడు నేను అండగా నిలుద్దాం అని అనుకున్నా. నేను నా పిల్లలను చూసి గర్వపడుతున్నా. మా పిల్లలిద్దరూ టాలెంటెడ్‌. హార్డ్‌ వర్కింగ్‌. వాళ్లకు యంగర్‌ జనరేషన్సతో మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉంటుంది. నా పిల్లలకు ఎప్పుడూ మీరు సపోర్ట్‌ చేయండి.

జీవితా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ – “ సినిమా కోసం అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అంద‌రినీ ఆశీర్వ‌దించండి“ అన్నారు.

శివాని మాట్లాడుతూ – “శివాత్మిక కెరీర్లో ఇది మ‌ర‌చిపోలేని రోజు. మ‌హేంద్ర‌గారు గొప్ప ద‌ర్శ‌కుడు. రేపు సినిమా రిలీజ్ త‌ర్వాత ఆ విష‌యం ఒప్పుకుంటారు.

శివాత్మిక రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ – “నాకు ఉహ తెలిసిన‌ప్ప‌టి నుంది యాక్ట‌ర్ కావాల‌నేదే కోరిక‌. ఆ కోరిక తీర్చింది న‌లుగురు వ్య‌క్తులు. డైరెక్ట‌ర్ మ‌హేంద్ర‌గారు న‌న్ను దొర‌సాని పాత్రలో ఎంపిక చేసుకున్నందుకు, త‌న‌కు థాంక్స్‌.