5 గంటల్లోనే 1 మిలియన్ లైక్స్

Disha-Patani-Glamorous-Selfie
Disha-Patani-Glamorous-Selfie

బాలీవుడ్ బ్యూటీ దిశా పతాని గురించి అసలు ఎవరికీ ఇంట్రో ఇవ్వాల్సిన పనే లేదు. కాల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్ బ్రాండ్ ప్రమోషన్స్ ను  కొత్త పుంతలు తొక్కించి అసలు లోదుస్తులంటే అవే మిగతావి లో లెవల్ దుస్తులు అనే రేంజ్ కి తీసుకెళ్ళిపోయింది.  అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి.. ఇలాంటి భామలోని టాలెంట్ గుర్తించి వెండితెరకు పరిచయం చేసింది మాత్రం మన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. మొదటి సినిమా ‘లోఫర్’ ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ అది దిశా కెరీర్ కు ఎలాంటి అడ్డంకి కాలేకపోయింది. బాలీవుడ్ లో నటించిన రెండు మూడు సినిమాలు హిట్స్ కావడం తో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.  ఇక ఇన్నర్ బ్యూటీని అరమరికలు లేకుండా పంచేస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ఫాలోయర్స్ చైనా జనాభా అంత తయారయ్యారు.  ఇన్స్టాలో ఫాలో ఫాలో అంటున్న నెటిజనుల సంఖ్య 20 మిలియన్లు దాటింది. ఇక వీరికోసం అప్పుదప్పుడూ కత్తిలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తూ థ్రిల్ చేస్తుంది.

అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ తాజాగా దిశా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక సెల్ఫి పోస్ట్ చేసింది. ఫ్రంట్ జిప్ ఉన్న ఒక టీ షర్టు ధరించి క్లోజప్ లో ఈ సెల్ఫీ తీసుకుంది.  జిప్పును కాస్త కిందకు లాగడంతో సాధారణ సెల్ఫీకి సెక్సీ లుక్ వచ్చేసింది. 

జస్ట్ పోస్ట్ చేసిన ఐదు గంటల్లోనే వన్ మిలియన్ లైక్స్ కొట్టారు. ఎనిమిది వేల కామెంట్లు పెట్టారు. ఒకడు “గాడ్స్ బెస్ట్ క్రియేషన్” అన్నారు.