రజనీ మూవీ రీమేక్‌పై ఆలోచన

Hero Dhanush

ధనుష్‌ ఇంకో రెండు కొత్త సినిమాలను సిద్దం చేస్తున్నారు.. వాటిలో కార్తీక్‌ సుబ్బరాజ్‌ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తికాగా, మారి సెల్వరాజ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.. ఇక ధనుష్‌ చేయాలనుకుంటున్న కొత్త సినిమాల జాబితాలో ఆయన మామయ్య , సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా కూడ ఉందని టాక్‌.. రజనీ 1981లో చేసిన నెట్రి కాన్‌ సినిమాను ధనుష్‌ ఇపుడు రీమేక్‌ చేయాలనే యోచనలో ఉనాన్నరట.. ఎస్పీ ముత్తురామన్‌ డైరెక్టు చేసిన ఈచిత్రంలో రజనీ డబుల్‌రోల్‌ చేశారు. ఈ రీమేక్‌లో కథానాయికగా కీర్తిసురేష్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారని తెలిసింది.. కాగా ఈరీమేక్‌ చిత్రానికి దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/