ఫిబ్రవరి 14న ‘దేవ్‌’ విడుదల

Karti, Rakul preet singh
Karti, Rakul preet singh

ఫిబ్రవరి 14న ‘దేవ్‌’ విడుదల

కార్తీ,రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తున్న దేవ్‌ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి14న విడుదల కానుంది.. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. హారీస్‌జయరాజ్‌ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈచిత్రానికి రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.. ఖాకీ లాంటి సూపర్‌హిట్‌ తర్వాత రకుల్‌ప్రీత్‌సింగ్‌ కలయికలో వస్తున చిత్రమిది.. ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ, పవర్‌ఫుల్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. నిక్కీ గల్రాని మరో కథానాయికగా నటిస్తోంది.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసమయంలో సినిమా విడుదల కానుంది. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్‌ మధు దక్కించుకున్నారు. రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.