రాజేష్‌ టచ్‌రివర్‌ దర్శకత్వంలో ‘సైనైడ్‌’

క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది

Rajesh Touchriver
Rajesh Touchriver

జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్‌ టచ్‌రివర్‌ ప్రకటించిన కొత్త సినిమా ‘సైపైడ్‌.

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు మోసిన నేరస్థులు, 20మంది యువతుల మరణానికి కారణమైన మానవ మృగం సైనైడ్‌..

మోహన్‌ కథతో ఈ సినిమా రూపొందుతోంది.. మిడిల్‌ ఈస్ట్‌ ప్రై.లి. పతాకంపై ప్రవాసపారిశ్రామికవేత్త ప్రదీప్‌ నారాయణన్‌ అరుదైన కేసుల్లో అరుదైన కేసుగా కోర్టు పరిగణించిన అతడి కథను తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించనున్నారు..

తాజాగా ఈచిత్రాన్ని ప్రకటించారు. దర్శకుడు మాట్లాడుతూ, ఇందులో తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ చిత్రపరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తున్నారని తెలిపారు.

నిర్మాత ప్రదీప్‌ నారాయణన్‌ మాట్లాడుతూ, కరోనా భయాలు పోయిన తర్వాత ప్రభుత్వ అనుమతి తీసుకుని చిత్రీకరణ ప్రారంభిస్తామన్నారు..

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/