కోలీవుడ్‌ నటుడు క్రేజీ మోహన్‌ కన్నుమూత

crazy miohan
crazy miohan, tamil camedian

కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ సీనియర్‌ కమెడియన్‌ క్రేజీ మోహన్‌ ఈ రోజు మధ్యాహ్నం గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ఇవాళ ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని దగ్గరలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు ఆయన్ను కాపాడడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆయన కన్నుమూశారు. కన్నుమూశారు.
అపూర్వ సోదరులు, మైకేల్‌ మదన కామరాజు, సతీలాలావతి, తెనాలి, పంచతంత్రం, కాదల కాదల, భామనే సత్యభామనే, వసూల్‌రాజా తదితర చిత్రాల్లో కామెడీ పాత్రలతో నటించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఈయన మృతికి సినీ పరిశ్రమ సంతాపాన్ని తెలియజేసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/