1400 మంది డ్యాన్సర్లతో

RAGHAVA LARENCE WITH DANCERS
RAGHAVA LARENCE WITH DANCERS

రాఘవ లారెన్స్‌ హీరోగా , స్వీయ దర్శకత్వంలో ముని సిరీస్‌ నుంచి వస్తున్న హారర్‌ కామెడీ చిత్రం కాంచన 3.. ఈచిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు విడుదల చేస్తున్నారు.. రాఘవేంద్ర ప్రొడోన్స్‌ బ్యానర్‌లో రాఘవ లారెన్స్‌ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఏప్రిల్‌ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.. దాదాపు 1400 మంది డ్యాన్సర్లతో రూ.కోటి ముప్పై లక్షలు ఖర్చుపెట్టి భారీ స్థాయిలో పాటను చిత్రీకరించారు. బి.మధు మాట్లాడుతూ, కాంచన 3 చిత్రం ఏప్రిల్‌ 19న విడుదల చేస్తున్నామని తెలిపారు. హీరో అండ్‌ డైరెక్టర రాఘవ లారెన్స్‌ తన నట విశ్వరూపం చూపించారన్నారు. దాదాపు 1400 మంది డ్యాన్సర్లతో మాస్టర్‌ అద్భుతంగా సాంగ్‌ షూట్‌ చేశారన్నారు.. 6రోజులపాటు సాంగ్‌ ను చిత్రీకరించినట్టు తెలిపారు. లారెన్స్‌కు ఈచిత్రం తన కెరీర్‌కే ప్రత్యేకమైందన్నారు.. మాస్‌ కమర్షియల్‌ చిత్రాలు తీయటంలో సిద్ధహస్తుడు మన లారెన్స్‌ మరోసారి తనేంటో ప్రూవ్‌ చేసుకున్నారన్నారు. తప్పకుండా అన్ని వర్గాలకు ఈసినిమా నచ్చేలా ఉంటుందనే నమ్మకంతో ఉన్నామన్నారు.