‘అన్నపూర్ణమ్మగారి మనవడు’

ANNAPURNAMMA GARI MANAVADU
ANNAPURNAMMA GARI MANAVADU

ఉమ్మడి కుటుంబాల్లో అనుబంధాలను, పల్లెటూరి ప్రేమలను తెలియజేస్తూ తెరకెక్కించిన చిత్రం అన్నపూర్ణమ్మగారి మనవడు.. టైటిల్‌ పాత్రధారులుగా సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్‌ రవితేజ నటించగా, బాలదిత్య, అర్చన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్‌ నటి జమున ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నారు.. సెన్సార్‌ క్లీన్‌ యు సర్టిఫికెట్‌ అందుకుంది ఈచిత్రం.. మహాశివరాత్రి కానుకగా, ఫిబ్రవరి 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని నిరఆమత ఎంఎస్‌ఆర్‌చౌదరి తెలిపారు.. మిత్రుల సహకారంతో ఈచిత్రాన్ని అమృత, ప్రణ§్‌ులకు అంకితం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు, తదితరులు మాట్లాడారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/