సోషల్ మీడియాలో రచ్చ

Amijackson
Amijackson

‘ఐ’ మూవీ ద్వారా మెరిసిన అమీ జాక్సన్ ఆ తర్వాత బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలోనే రజినీ హీరోగా రూపొందుతున్న ‘2.0’లో హీరోయిన్ గా చేస్తోంది. లండన్ నుంచి దిగుమతి అయిన ఈ హాట్ బ్యూటీ సినిమాల్లోనే కాదు బయటా కూడా హాటే అని నిరూపించింది.  సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ తో అమీజాక్సన్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు..  బికినీ – స్విమ్ – ట్రాన్సపరేంట్ ఇలా రకరకాల దుస్తులు వేసుకొని తన అందచందాలను ఏమాత్రం దాచుకోకుండా అభిమానులకు కన్నుల విందు చేస్తోంది. అమీ ఇన్ స్టాగ్రామ్ ఖాతా  ఓపెన్ చేస్తే ఎన్నో రోమాంటిక్ ఫొటోలు దర్శనమిస్తుంటాయి.   ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో 5 లక్షల ఫాలోవర్స్ ను ఈ బ్యూటీ సొంతం చేసుకుంది.