పాప బోటు షికారు!

Amala Paul
Amala Paul

ఎందరు కథానాయికలు ఉన్నా అమలాపాల్ స్పెషల్. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో అమలాపాల్ ఎంతగా అలసి సొలసి విసిగి వేసారిపోయిందో అర్థం చేసుకోవాల్సిందే. అదంతా సరే.. అంతగా జీవితం అనే అంకంలో అలసిసొలసినప్పుడు సేద దీరాంలంటే ఏం చేయాలి?  అలల తాకిడితో ఎగసిపడే సముద్రంలోకి కళ్లు పెట్టి చూడాలి. లేదంటే ఇదిగో అమలాపాల్ చేస్తున్నట్టు నదులు – సరస్సులు – కాలువల్లో బోట్ షికార్ కి అయినా వెళ్లాలి. అన్నిటినీ మరిచి అందమైన ప్రకృతిని వీక్షించే అవకాశం దక్కుతుంది.
స్వస్థలం కేరళలో ఇలా బోట్ షికార్ కి బయల్దేరిన అమలా పూర్తిగా అన్నిటినీ మరిచి హాయిగా ఎంజాయ్ చేస్తుంది. పొట్టి నిక్కరులో స్వేచ్ఛగా షికారుని కొనసాగించింది. ఆ బోట్ లో నిదురించడానికి చాప – ఆ పక్కనే రెడ్ కలర్ బ్యాగు ఉన్నాయి. మొత్తానికి ఇలాంటి అరుదైన అవకాశం అందరికీ రానేరాదు. ఆ క్షణం జీవితాన్ని నచ్చినట్టు ఎంజాయ్ చేసేయాలంతేనని అమలాని చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన `ఆడై` టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కామిని అనే ఆసక్తికర పాత్రలో నటిస్తోంది. `ఆడుజీవితం` అనే చిత్రంలోనూ నటిస్తోంది.