ఆలియాభట్‌ పట్టుదల

మళ్లీ తెలుగు పాఠాలు

Alia Bhatt
Alia Bhatt

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిన ఆలియాభట్‌.. పాత్ర పర్ఫెక్షన్‌ కోసం అంటూ తెలుగు నేర్చుకోవాలనుకుంది..

ఈ ఏడాది ఆరంభంలో కొన్ని రోజులు ఆన్‌లైన్‌ తెలుగు పాఠాలను ఆలియా విన్నట్టుగా తెలిసింది.. కొన్నికారణాల వల్ల ఇన్ని రోజులు ఆలియా తెలుగు పాఠాలు పక్కకు పెట్టింది.

మళ్లీ ఇపుడు షూటింగ్స్‌ లేని కారణంగా తెలుగు పాఠాలు వింటోందట.. రామ్‌చరణ్‌ జోడీ పాత్రలో సీతగా ఆలియాభట్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటించబోతోంది..

నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వటంతో పాటు చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర అవ్వటం వల్ల తెలుగు నేర్చుకుంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఆలియా తెలుగు నేర్చుకుంటోంది..

ఆలియా పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తోందంటూ అభిమానులు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/