సాహస నిర్ణయం

చిత్రీకరణ ఆపకుండా చేసిన తొలి స్టార్‌హీరో

Akshay Kumar-
Akshay Kumar-

కరోనా సంక్షోభంలో కూడ తన సినిమా చిత్రీకరణను ఆపకుండా చేసిన తొలి స్టార్‌హీరో దేశంలోనే అక్షయ్ కుమార్‌ ఒక్కరే.. ఇపుడు మరోసారి అక్షయ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు..

కరోనా ప్రవాహంలో కూడ మరో సినిమా షూటింగ్‌ కోసం సమాయత్తమవుతున్నారు.

తన కొత్త చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.. వాసు భగ్నాని నిర్మాణంలో అక్షయ్ ‘బెల్‌బాటమ్‌ అనే సినిమా చేస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఆగస్టు నెలలో ఈచిత్రంలోని కీలక సన్నివేశాలను షూట్‌ చేయటానికి యూనిట్‌ ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటుందని తెలిసింది..

కాగా ఈచిత్రం పీరియాడిక్‌ డ్రామా అని తెలిసింది.. 1980 నాటి కాలంలో ఈసినిమా కథ సెట్‌ చేయబడిందట..

నిజమైన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్న ఈచిత్రంలో హుమా ఖురేషీ, వాణీకపూర్‌, లారా దత్తా కీలకపాత్రలు పోషిస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/