అక్కినేని అమల ముఖ్యపాత్రలో వెబ్‌సిరీస్‌

Akkineni Amala in Web Series
Akkineni Amala in Web Series

శ్రీమతి అక్కినేని అమల చాలా రోజుల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. జి5 యాప్‌ నిర్మించిన వెబ్‌సిరీస్‌ హై ప్రిస్ట్స్‌లో అమల ముఖ్యపాత్ర పోషించారు.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ ఈనెల 25 నుంచి జి5 లో ఆన్‌లైన్‌ అవుతుంది.. ఈసందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు.. టారో రీడింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ను పుష్ప డైరెక్టు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో అమలతోపాటు నటుడు బ్రహ్మాజీ, వరలక్ష్మిశరత్‌ కుమార్‌, సునైనా, బిస్‌బాస్‌ 2ఫేం నందిత తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీమతి అమల మాట్లాడారు.. కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల తెరపై తక్కువగా కన్పిస్తున్నానని, చాలా రోజుల తర్వాత పుష్పగారు చెప్పిన లైన్‌ నచ్చటంతో ఈ ప్రాజెక్టులో నటించేందుకు ఒప్పుకున్నానని తెలిపారు.. తనకు బాగా ఆసక్తిగా అన్పించే టారో రీడింగ్‌ నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్‌ కథ ఉండటం తనకు బాగా నచ్చిందన్నారు. ప్రేక్షకులకు కూడ నచ్చుతుందని అన్నారు..