ఆకాష్‌…అదరహో

తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం

Actor Akash

‘ఆనందం’తో తెలుగుప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించిన అందాల కధానాయకుడు ఆకాష్‌.

వసంతం, అందాల రాముడు, గోరింటాకు, నమో వెంకటేశ తదితర చిత్రాలతోనూ విశేషంగా ఆకట్టుకున్నారు.. కెరీర్‌ పరంగా ఇపుడు రెట్టించిన ఉత్సాహంతో పూర్వవైభవం పొందే దిశగా అడుగులు వేస్తున్నారు..

ఆకాష్‌ కన్నడలో నటించిన జోతాయి. జోతాయల్లీ అనే సీరియల్‌ అక్కడి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది..

ఇదే సీరియల్‌ తమిళంలో నీతనైన ఎంతన్‌ పొన్వసంతన్‌ పేరుతో డైలీ సీరియల్‌గా ప్రసారమవుతూ..తమిళనాట ఆకాష్‌పేరు మార్మోగేలా చేస్తోంది.

అంతేకాదు ఆకాష్‌ నటించిన 5 చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఏ-క్యూబ్‌ పేరుతో ఒక మూవీ యాప్‌ను కూడ సిద్దం చేసుకున్న ఆకాష్‌..

‘అందాల రాక్షసుడుగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/