‘స్పెషల్‌’ ముఖ్యపాత్రలో

Special movie trailer launch
Special movie trailer launch

అజ§్‌ు, రంగ, అక్షత, సంతోష, అశోక్‌కుమార ముఖ్యపాత్రలోల వాస్తావ్‌ దర్శతక్వంలో నందలాల్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నందం శ్రీవాస్తవ్‌ నిర్మిస్తున్న చిత్రం స్పెషల్‌.. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మే లో విడుదల చేయటానికి సిద్ధంగా ఉంది.. మంగళవారం చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు అజ§్‌ు మాట్లాడారు.. ఈసినిమాలో ముఖ్యపాత్రలో చేశానని తెలిపారు. పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా కన్పిస్తానని, దర్శకుడు వస్తావ్‌ అద్భుతమైన కథ చెప్పాడన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, ఎక్కడో చదివిన విషయం స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రమన్నారు. తప్పకుండా ప్రేక్షకులకు ఆసక్తి కల్గించేలా ఉంటుందన్నారు . అజ§్‌ు చక్కగా చేశారన్నారు. ఇటీవల సెన్సార్‌సభ్యులు కూడ చూసి అభినందనలు తెలిపారని వెల్లడించారు.. ఈచిత్రాన్ని మేలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హీరోయిన్‌ అక్షత తదితరుల మాట్లాడారు.