అజయ్‌ దేవగణ్‌ తండ్రి కన్నుమూత

Ajay Devgn's father Veeru Devgan
Ajay Devgn’s father Veeru Devgan

ముంబయి: ప్రముఖ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ తండ్రి, వీరు దేవగణ్‌ కన్నుమూశారు. ఆయన అనారోగ్య సమస్యతో ముంబయిలోని సూర్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. సాయంత్రం ఆరు గంటలకు విలెపార్లేలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వీరూ దేవగణ్‌ అనేక సినిమాలకు యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. బాలీవుడ్‌లో యాక్షన్‌ సన్నివేశాల కోసం తొలిసారి రోప్‌ (తాడు) వాడిన కొరియోగ్రాఫర్‌ వీరూ దేవగణ్‌ కావడం విశేషం. అంతేకాదు ఆయన 1999లో అమితాబ్ బచ్చన్‌, అజయ్‌, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో నటించిన హిందుస్థాన్‌ కీ కసమ్‌ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. వీరూ దేవగణ్‌ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/