ఆదా ..మదర్స్ డే సర్ప్రైజ్ వీడియో

సోషల్ మీడియాలో వైరల్

Adah-Sharma-yoga-Pose-Viral-in-Social-media
Adah-Sharma-yoga-Pose-Viral-in-Social-media

ఆదా శర్మ…ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ‘హార్ట్ ఎటాక్’ అనే చెప్పాలి. ఈ సినిమాలో నితిన్ సరసన అందాలు ఆరబోస్తూనే తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది.

అల్లు అర్జున్ తో ‘సన్ అఫ్ సత్యమూర్తి’ సినిమాలో కూడా నటించింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది.

ఆ తర్వాత ‘గరం’ ‘క్షణం’ ‘కల్కి’ చిత్రాల్లో మెరిసింది. ‘1920’ సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ మళ్ళీ బాలీవుడ్ కి చెక్కేసింది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఆదాశర్మ తన టిక్ టాక్ వీడియోలను.. వర్క్ అవుట్ వీడియోలను.. ఫోటోలను పోస్టు చేస్తూ కుర్రకారుకి హీట్ పెంచేస్తూ ఉంటుంది.

ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ ఇంకొంచెం డోస్ పెంచి ఫొటోస్ పోస్టు చేస్తూ వస్తోంది. ఇప్పుడు మదర్స్ డే సందర్భంగా మరో వీడియో పోస్టు చేసింది.

అందరిలా తమ తల్లితో దిగిన ఫోటోలు షేర్ చేయకుండా తన క్రియేటివిటీతో ఒక వీడియో చేసి అప్లోడ్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ కి గురయ్యారు.

ఓం శాంతి ఓం మూవీలోని సాంగ్ ప్లే అవుతుండగా తన రెండు కాళ్ళ మధ్యలో తలను ఉంచి ఒక యోగాసనాన్ని వేసింది.

ఇది చూసిన వారు ఆదా బాడీ ఇంత ఫ్లెక్సిబిల్ గా ఉంటుందా అని అనుకోకమానరు. ఎందుకంటే అది అంత కష్టమైన యోగాసనం.

అయితే ఈ వీడియో చివర్లో ఆదా శర్మ తల్లి బయటకి వచ్చింది. అంటే ఇప్పటి దాకా అందరూ ఆదా కాళ్ళు అనుకున్నవి ఆమె అమ్మగారి కాళ్లన్నమాట. 

ఈ సందర్భంగా ఆదా శర్మ ”హ్యాపీ మదర్స్ డే. ఈ వీడియో చివరి దాకా చూడండి. ‘అమ్మ’లు ప్రతి చోటా ఉంటారు. కానీ మా అమ్మ తెలివైంది.

స్ట్రాంగెస్ట్ బెస్ట్ హానెస్ట్ ప్రెట్టియెస్ట్ మోస్ట్ ఫ్లెక్సిబిల్ క్విక్కెస్ట్ కుక్. వంటలో మా అమ్మని ఎవరూ బీట్ చేయలేరు” అంటూ కామెంట్ పెట్టింది.

ఇప్పుడు అదాశర్మ మదర్స్ డే స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/