మళ్లీ గ్లామర్ రోల్స్

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాధిక కొత్త చిత్రాలు

Actress Radhika

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి గౌడ భార్య అయిన రాధిక గతంలో హీరోయిన్ అనే విషయం తెల్సిందే.

పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రాధిక మళ్లీ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. కుమార స్వామి సీఎంగా ఉన్న సమయంలోనే ఈమె రెండు మూడు సినిమాలకు కమిట్ అయ్యింది.

రాధిక నటించిన రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సమయంలోనే రాధిక మరింత స్పీడ్ పెంచాలని భావిస్తుందట.

కన్నడ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈమె యంగ్ హీరోలకు జోడీగా నటించేందుకు కూడా ఆసక్తిగా ఉందట.

హీరోయిన్ గానే కాకుండా సినిమాల్లో కీలక పాత్రలు చేసేందుకు కూడా ఈమె ఓకే చెబుతోందట.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/