అగిప్రమాదాలపై అవగాహన పెంచాలి

Actress Amala with Fire Station Staff
Actress Amala with Fire Station Staff

హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని అగ్నిమాపక కేంద్రంలో అగ్నిప్రమాద వారోత్సవాలు ఆదివారం ప్రారంభించారు.. ముఖ్యఅతిథిగా శ్రీమతి అక్కినేని అమల పాల్గొన్నారు.. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల్లో అగ్నిప్రమాదాల గురించి మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బంది కష్టాలేమిటో తనకు అర్ధమైందని, ఒక్క నిముషంలో ఫైర్‌ ఎంత వేగంగా వ్యాపిస్తుందో తెలుసునని ఆ సమయంలో సిబ్బంది పనితీరు అభినందనీయమని అన్నారు.. ప్రమాద సమయంలో మనం చేయాలో ఏం చేయకూడదో అనే విషయాలపై మరింత అవగాహన పెంచాలనానరు.. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సురేష్‌రెడ్డి, డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి, ఫిలింనగర్‌ ఫైర్‌స్టేషన్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌, వి.సత్యానంద్‌, తదితరులు పాల్గొన్నారు… ఈసందర్భంగా ఫైర్‌స్టేషన్‌ సిబ్బంది తరపు ఒక జ్ఞాపికతో శ్రీమతి అమలకు బహూకరించారు.