మనం ఫెయిలైతే మనల్ని హర్ట్‌చేసేవాళ్లు ఎక్కువ: సునీల్‌

Astor Suneel Interview
Actor Suneel

సాయితేజ్‌, కల్యాణి ప్రియదర్శిన్‌, నివేదాపేతురాజ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం చిత్రలహరి.. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ , సివిఎం నిర్మాతలు. కిషోర్‌ తిరుమల దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈచిత్రం గురించి నటుడు సునీల్‌ మాట్లాడారు.

ఇపుడున్నంత టెక్నాలజీ ఒకపుడు లేదు.. నేను ఒకర్ని ఏడిపించటం లేదు..నవ్వించి సంపాదించుకుంటున్నాను.. రీసెంట్‌గా ఒకరు నేను చనిపోయినుట్ట యూ ట్యూబ్‌లో పెట్టారు.దాని వల్ల వాళ్లకి వన్‌ మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి.. నేను పోలీసు కంప్లైంట్‌ ఇస్తే..తను సారీ తప్పైందని చెప్పాడు.. సరేనని వదిలేశాను..తనని అరెస్ట చేయించి ఇబ్బంది పెడితే నాకు ఏమోస్తుంది..

మనం ఫెయిలైతే మనల్ని హార్ట్‌చేసేవాళ్లు ఎక్కువ.. సక్సెస్‌ అయితే పొగిడేవాళ్లు ఎక్కువ అవుతారు.. మనల్ని మనం పవర్‌ఫుల్‌ అనుకోకపోతే బ్రతకలేం.. కానీ ఎప్పటికీ మన చుట్టూ ఉన్న సిట్యువేషన్‌ పవర్‌ఫుల్‌.అదే మన అవసరాలను నిర్ణయిస్తుంది.. ఒకపుడున్న ప్రయారిటీ ఇపుడు మారిపోతుంటుంది..హర్ట్‌ కాకుండా పోవటం అనేది ఉండదు.. ప్రతి విషయం నుంచి నేర్చుకుంటూ ముందుకుపోతూ ఉండాలి…
గెలుపు ఓటములు అనేదాన్ని దేవుడు నిర్ణయించలేదు.. మనం పెట్టుకున గేమ్‌ ఇది.. ఉదాహరణకు 100 మీ పరుగు పందెం పెట్టుకున్నపుడు అందరూ ఎవరు నెగ్గితే వాళ్లు గొప్పోళ్లు.. ఇలా ఎవరికి ఒకరు ఓ ప్రొఫెషన్‌ను ఎంచుకుని ముందుకెళుతుంటాం..

తదుపరి బన్ని, త్రివిక్రమ్‌ సినిమా చేస్తున్నాను.. మరో రెండు పెద్దసినిమాలు డిస్కషన్‌లో ఉన్నాయి.. మరోపెద్దస్టార్‌ సినిమాలో కూడ నటించబోతున్నాను.