ప్రముఖ కమెడియన్‌ దిన్‌యర్‌ కన్నుమూత

Dinyar
Dinyar

న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు, కమెడియన్‌ దిన్‌యర్‌ (79) ఈరోజు ఉదయం ముంబయిలో కన్నుమూశారు. ఆయన వృద్ధాప్య కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2001లో వచ్చిన మల్టీ స్టారర్‌ మూవీ చోరీ చోరీ చుప్‌కే చుప్‌కేలో హోటల్‌ మేనేజర్‌గా, అక్షయ్‌ కుమార్‌ మూవీ కిలాడీలో ప్రిన్సిపల్‌ పాత్రలో, షారుక్‌ ఖాన్‌ నటించిన బాద్‌షాలో క్యాసినో మేనేజర్‌గా వేసిన పాత్రలు దిన్‌యర్‌కు బాగా ప్రాచుర్యం కల్పించాయి. గుజరాత్‌, హిందీ నాటక రంగంతో అనుబంధం కలవాడు. ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దిన్‌యర్‌ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడి సంతాపం తెలిపారు. అయితే ఈరోజు వర్లీ శ్మాశనవాటికలోదిన్‌యర్‌ అంత్యక్రియలు జరపనున్నట్లు తెలిపారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/