‘గాన గంధర్వుడు’కి దేశప్రముఖుల అశ్రునివాళి

సాంస్కృతిక ప్రపంచం మూగబోయింది: ప్రధాని ట్వీట్‌

SP Bala subrahmanyam
SP Bala subrahmanyam

కొన్నేళ్లపాటు తన గాత్రంతో ప్రేక్షకులను అలరించిన ‘గాన గాంధర్వుడు’ మరణం చిత్ర పరిశ్రమను తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది.ఆయన మృతితో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి..

హిందీతోపాటు దక్షిణాది భాషల్లో దాదాపు 50వేల పాటలు పాడి, నటుడిగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాలు పేరొందారు.

ఆయన మరణంతో దేశవ్యాప్తంగా అందరూసంతాపం తెలుపుతున్నారు. దేశం గర్వించదగ్గ గాయకుల్లో బాలు ఒకరు.. ఆయన మరణంతో ముఖ్యంగా సినీ ప్రపంచం మూగబోయింది..

ఆయనకు నివాళులు చెబుతూ పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ట్వీట్లు చేశారు. ‘మీ పాటలతో మా గుండెల్లో ఎప్పటికే బతికే ఉంటారు అంటూ పేర్కొన్నారు.

మన సాంస్కృతిక ప్రపంచం మూగబోయింది: ప్రధాని మోడీ ట్వీట్‌

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దురదృష్టకర మరణంతో మన సాంస్కృతిక ప్రపంచం మూగబోయింది. భారతదేశం అంతటా ఆయన శ్రావ్యమైన స్వరం, సంగీతం దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది..

ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నా.. ఓం శాంతి.. అంటూ మోడీ వ్యాఖ్యానించారు.

రాహుల్‌గాంధీ, తెలంగాణ, ఆంధ్రా సిఎంలు కెసిఆర్‌, వైఎస్‌ జగన్‌ సంతాపం

ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సహా తెలంగాణ సిఎం కెసిఆర్‌, మంత్రులు తలసాని, హరీష్‌రావు, కవిత, ఎపి సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాలు మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు..

గానగంధర్వుడు ఎస్పీ బాలుగారు ఇక లేరన్న విషయం దిగ్భ్రాంతికి గురించేసింది.. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను అని ఎపి సిఎం జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

సినీ ప్రపంచంలోనే ఇవాళ చీకటి రోజని మెగాస్టార్‌ చిరంజీవి ఆవేదనతో ట్వీట్‌ చేశారు.

అగ్రహీరోలు నాగార్జున, వెంకటేష్‌, బాలకృష్ణ, మహేష్‌బాబు సహా టాలీవుడ్‌ హీరోలు,సంగీత దర్శకులు, దర్శకులు బాలు మృతికి సంతాపం తెలిపారు..

ఎఆర్‌ రెహమాన్‌ బాలుతో ఫొటో పంచుకుని ఆవేదన వ్యక్తంచేశారు. తోటి గాయకులు కూడ ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.

బాలీవుడ్‌ ప్రముఖుల సంతాపం:

బాలీవుడ్‌ ప్రముఖ హీరోలు సల్మాన్‌ఖాన్‌, అక్ష§్‌ుకుమార్‌ సహా సినీ,రాజకీయ ప్రముఖులంతా బాలు మృతికి సంతాపం తెలిపారు. విలక్షణ నటుడు కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, తమిళ హీరోలు, దర్శకులు, సంగీత దర్శకులు బాలు మృతికి దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తూ ట్వీట్లు పెట్టారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/