ద‌స‌రా బ‌రిలోకి `చాణ‌క్య‌`

A Still From Chanakya
A Still From Chanakya

వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా `చాణ‌క్య` యూనిట్ ప్రేక్ష‌కుల‌కు వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `చాణక్య‌`. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ఇట‌లీ, మిలాన్‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌.