80 మంది కమెడియన్లతో ‘ఊ.పె.కు.హ’

U.PE.KU.HA
U.PE.KU.HA

80 మంది కమెడియన్లతో ‘ఊ.పె.కు.హ’

రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో బేబీ లక్ష్మీ నరసింహ హేమ బుషిత సమర్పణలో జెబి క్రియేషన్స్‌ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి నిర్మించిన సినిమా ‘ఊ.పె..కు.హ, ‘ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అనేది ఉపశీర్షిక.. సాక్షిచౌదరి కథానాయిక, నిధి ప్రసాద్‌ దర్శకుడు . అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈసినిమా పాటలు ఇటీవల విడుదలై మంచి స్పందన రాబట్టుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈచిత్రం ఏప్రిల్‌ 27న వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈసందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, దర్శకుడు నిధి ప్రసాద్‌ గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.. నటీనటుల , సాంకేతిక నిపుణులు అంతా బాగా సహకరించారు. సినిమా చాలా బాగా వచ్చింది.. అందరినీ అలరించే చిత్రమవుతుందన్నారు.

దర్శకుడు నిధి ప్రసాద్‌: మాట్లాడుతూ సినిమా అనుకున్న దానికంటే కూడ చాలా బాగా వచ్చినందుకు చాలాచాలా సంతోషంగా ఉందన్నారు.రాజేంద్రప్రసాద్‌గారి నటన ఈసినిమాకు ప్రత్యేక ఆకర్షణ. అలాగే అనూప్‌ సంగీతం మరో హైలెట్‌ . సినిమా నటించిన నటీనటులందరూ ఎంతగానో సపోర్ట్‌చేశారన్నారు. ఈనెల 27న హడావుడి మొదలువుతందని ప్రేక్షకులందరికీ సినిమా నచ్చేలా ఉంటుందన్నారు.