16న విశాఖలో జమునకు ‘నవరస నట కళావాణి’ ప్రదానం

JAMUNA
JAMUNA

16న విశాఖలో జమునకు  నవరస నట కళావాణి ప్రదానం

సుబ్బిరామిరెడ్డి ఏటా తన పుట్టినరోజు నాడు చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన వారిలో ఒకరిని ఎంపిక చేసి.. బ్రహ్మాండమైన సన్మానం చేసి బిరుదు ఇస్తుంటారు. సెప్టెంబరు 16న జమునను విశాఖలో ఘనంగా సన్మానించడంతో పాటు ఆమెకు నవరస నట కళావాణి అనే బిరుదు ప్రదానం చేయనున్నారు. జమున తన జీవితంలో వజ్రోత్సవ సంవత్సరంలో (డైమండ్ జూబ్లీ) అడుగు పెడుతున్న సందర్భంగా ఆమెను ఈ గౌరవానికి ఎంపిక చేశామని సుబ్బిరామిరెడ్డి తెలిపారు. జమున సన్మాన కార్యక్రమానికి ఆమెతోపాటు కలిసి నటించిన బి.సరోజాదేవి – వాణిశ్రీ – శారద – జయప్రదద- జయసుధ – కృష్ణంరాజు – మోహన్ రాజు – అలనాటి అందాల తార శ్రీదేవి ఈ వేడుకులకు హాజరు కానున్నారు. సాధారణంగా సుబ్బిరామిరెడ్డి నిర్వహించే ప్రోగ్రాంలన్నింటికీ ఆహ్వానించిన సెలబ్రిటీల్లో చాలామంది హాజరవుతుంటారు. ఈ లెక్కన సెప్టెంబరు 16న విశాఖలో నాటి తారాలోకమంతా సందడి చేయనుంది.