హిందూ ముస్లిం కథలో..

amala paul
amala paul

రియల్‌ లైఫ్‌ ఎంత డిఫరెంట్‌గా ఉంటుందో. సినిమా లైఫ్‌ కూడ అదే తరహాలో ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరు ఏ పాత్రను పోషించినా కూడ. భలే వింతగా ఉంటుంది. అదిగో ఇపుడు స్వతహాగా క్రిస్టియన్‌ అయిన ఒక హీరోయిన .తెరపై ఒక ముస్లిం యువతి పాత్రలో నటిస్తూ. ఒక హిందూ యువకుడి ప్రేమలో పడే పాత్రలో నటిస్తోంది. త్వరలో రాబోయే ఒక సినిమాలో మలయాళ భామ అమలాపాల్‌. ఒక ముస్లిం యువతి పాత్రలో కన్పించనుంది. చరణ్‌తేజ్‌ అనే హీరో కం దర్శకుడు ‘ఆయుష్మాన్‌ భవన అనే సినిమా చేస్తున్నారు. ఈసినిమాను మొత్తంగా తూర్పు గోదావరి జిల్లాలో సూటింగ్‌ చేస్తున్నప్పటికీ .కథ మాత్రం యూనివర్సల్‌ ఎప్పీల్‌ కలిగియుంటుందట. అందుకే మెయిన్‌ హీరోయిన్‌ పాత్రకు అమలాపాల్‌ను ఎంచుకున్నారని టాక్‌. మతసామరస్యం తాలూకూ భావాలన్నీ అసలు అమల పాత్రలోనే కన్పిస్తున్నాయని టాక్‌.