హరి ఉంటే సినిమా సెట్‌ అంతా సందడి

SAMUDRA ,DIRECTOR
SAMUDRA ,DIRECTOR

హైదరాబాద్‌: హరికృష్ణ సినిమా సెట్‌లో ఉన్నారంటే సందడిగా ఉండేదని ప్రముఖ దర్శకుడు సముద్ర అన్నారు. సినిమా సెట్‌లో హరి జోకులు వేస్తూ అందరినీ నవ్వించేవారనీ, తమ మధ్య 15 ఏళ్ల అనుబంధం ఉందని సముద్ర గుర్తు చేసుకున్నారు. కుటుంబ విలువలు ఉన్న శివరామరాజు సినిమాలో హరి తండ్రి పాత్ర చేయాలని కోరగా ఆయన ఆ సినిమాలో నటించారని తెలిపారు. ఈ సినిమా అప్పట్లో రాష్ట్రంలో ప్రజలపై గొప్ప ప్రభావం చూపిందని సముద్ర అన్నారు. ఈ కారెక్టర్‌ క్లిక్‌ అవ్వడంతో హరికృష్ణ చాలా సంతోషించారని చెప్పారు.