స్ట్రాంగ్‌ క్యారెక్టర్లును చేయాలనుకుంటున్నా

PALAK22
PALAK

రంజిత్‌, పాలక్‌ లల్వానీ జంటా ‘దిక్కులు చూడకు రామయ్య ఫేం త్రికోటి పేట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జుల్వ ఎస్‌వి రమణ సమర్పణలో సొమ్మి ఫిలింస్‌పై డాక్టర్‌ భరత్‌ సోమి ఈచిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 23న సినిమా విడుదలువుతుంది.. . ఈసందర్భంగా హీరోయిన్‌ పాలక్‌ లల్వానీతో పాత్రకేయులతో సినిమా గురించి మాట్లాడుతూ, అబ్బాయిలతో అమ్మాయి.. సినిమా తర్వాత దర్శకుడు త్రికోటిగారు నన్ను ఈసినిమా కోసం సంప్రదించారన్నారు.కథ వినగానే బాగా నచ్చింది..

ఈసినిమాను ఏడాది క్రితమే స్టార్‌ చేశారన్నారు. సినిమా పూర్తికాగానే జివి ప్రకాష్‌తో ఓ సినిమాను, కేరింత ఫేం విశ్వాంత్‌తో మరోసినిమాను కూడ పూర్తిచేశానన్నారు. వాటి పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.జువ్వ సినిమాలో నెక్స్‌ట్‌డోర్‌ అమ్మాయిగా కనపడతానని, సింపుల్‌గా ఉంటుందన్నారు హీరో రంజిత్‌ మంచి కోస్టార్‌ అని చెప్పారు. సినిమా ప్రారంభం నుంచి పూర్తి అయ్యేటప్పటికీ ఫెర్ఫామెన్స్‌ పరంగా ఎంతో ఇంప్రూవ్‌ అయ్యాడన్నారు..

నా తొలి సినిమా అబ్బాయితో అమ్మాయి మూవీ బాక్సాఫీస్‌ వద్ద సరైన ఫలితాన్ని రాబట్టుకోలేదని చెబుతూ, అయితే దాని ఎఫెక్ట్‌ నాపై పడలేదన్నారు. జయాపజయాలు నటులపై ప్రభావాన్ని చూపవని అనుకుంటానని చెప్పారు.. అనుష్క శెట్టి, సాయిపల్లవి చేసేటువంటి డిఫరెంట్‌, స్ట్రాంగ్‌ క్యారెక్టర్లును చేయాలనుకుంటున్నాని తెలిపారు. అయితే ప్రస్తుతం నేను ప్రారంభ దశలోనే ఉన్నానని, హీరోయిన్‌గా మంచి పొజిషన్‌ చేరుకున్న తర్వాత మంచి పాత్రలను ఎంచుకోవటానికి ప్రయత్నిస్తానని. ప్రస్తుతం నా దర్శకులను నమ్మే సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చారామె..