సూర్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో..

surya
surya

ప్రముఖ నటుడు సూర్య, సాయిపల్లలవి కాంబినేషన్‌లో దర్శకుడు సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో రీసెంట్‌గాఖాకీ వంటి హిట్‌ చిత్రాన్ని
అందించిన డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఎస్‌.ఆర్‌.ప్రభు ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబుల కొత్త చిత్రం షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. సీనియర్‌ హీరో శివకుమార్‌, సూర్య, కార్తీ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. హీరో సూర్య మాట్లాడుతూ తన గత 35 చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. సెల్వరాఘవన్‌చెప్పిన కథ చాలా ఎక్సైటింగ్‌గా ఉందన్నారు. కమర్షియల్‌ వాల్యూస్‌ ఉంటూ అందరినీ ఆకట్టుకునే చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవి క్యారెక్టర్‌కి కూడ మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుందన్నారు. దర్శకుడు సెల్వరాఘవన్‌ మాట్లాడుతూ, సూర్య లాంటి వెర్సటైల్‌ హీరోతో సినిమా చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కథకు సూర్య ఒక్కరూ యాప్ట్‌ అనిసినిమా చూశాక తెలుస్తుందన్నారు. నిర్మాతలు ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు మాట్లాడుతూ, సూర్య, సాయిపల్లవి, సెల్వరాఘవన్‌ కాంబినేషన్‌లోవస్తున్న మంచి సినిమా అన్నారు. సూర్య కెరీర్‌లో పెద్దహిట్‌ అయ్యేలా దర్శకులు ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారన్నారు. జనవరి 18న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి దీపావళఙకి చిత్రం రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నామన్నారు.