సురయ నాట్య విలాసానికి యువత గుండెలు …

Katrina Kaif
Katrina Kaif

డ్యాన్సులకు అథ్లెటిక్ ఫీట్స్ని జోడించి మెరుపులు మెరిపిస్తుంది కత్రిన. వయసు 30 ప్లస్ అయినా – టీనేజీ స్వింగు క్యాట్ లో ఏమాత్రం తగ్గలేదు. ఒంటిని విల్లులా వంచగలదు. నాట్యం కోసం మడత పెట్టిన టైరులా ఒంగిపోగలదు. అమీర్ `ధూమ్ 3`లో అథ్లెటిక్ ఫీట్స్ తో సర్కర్ బేబిగా అలరించినా `టైగర్ జిందా హై` చిత్రంలో సల్మాన్ కి ధీటుగా భారీ యాక్షన్ దృశ్యాలతో కట్టిపడేసినా..ఈ అమ్మడికే చెల్లింది.

అమీర్ ఖాన్ – అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లు నటించిన భారీ బడ్జెట్ చిత్రం `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్`లో ఆ ఇద్దరికీ ధీటైన పాత్రలో కత్రిన నటించింది. సురయ అనే రాజనర్తకిగా కనిపించనుంది. ఈ పాత్రకు సంబంధించిన ఇంట్రో వీడియోలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయ్యాయి.

సురయ నాట్య విలాసానికి యువతరం గుండెలు జిల్లన్నాయి. తాజాగా సామాజిక మాధ్యమాల్లోకి వచ్చిన కత్రిన డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో చూసిన వారికి ఈ సంగతి ఇట్టే అర్థమవుతుంది.  గ్రహాంతర వాసి నర్తించినట్టే ఉంటుంది! అంటూ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అంతటివాడే కత్రినను పొగిడేశాడంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపు 200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించామని చెబుతున్న థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ దీపావళి కానుకగా నవంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది.