‘సుబ్రహ్మణ్యపురం’. సక్సెస్‌మీట్‌

Success Meet
Success Meet

సుమంత్‌, ఈషా రెబ్బా హీరో హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సంతోష్‌ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్‌ ఇంపెక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్‌ 7న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో…

మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ – ”’సుబ్రహ్మణ్యపురం’ చిత్రాన్ని నా మిత్రుడు బీరం సుధాకర్‌ రెడ్డిగారు నిర్మించారు. ట్రైలర్‌ రిలీజ్‌ రోజునే సినిమా పెద్ద హిట్‌ అవుతుందని చెప్పాను. మేం ఏదైతే అంచనా వేశామో అది ఈరోజు నిజమైంది. ప్రేక్షకులు మా సినిమాను పెద్ద ఎత్తున ఆదరించి అభిమానించారు. సినిమా పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మొదటిరోజు సినిమా ఫలితం ఎలా ఉందో ఇప్పటికీ అదేలా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి ఉన్నప్పటికీ కూడా మ్యాట్నీషో నుండి స్క్రీన్స్‌ పెరిగాయి. హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతూ వస్తున్నాయి. మంచి కలెక్షన్స్‌ను సినిమా సాధించింది. ఊహించిన ఫలితం కంటే రెట్టింపు ఫలితం నిర్మాతగారికి దొరికింది. శాటిలైట్‌ రూపంలో.. డిజిటల్‌ రూపంలో.. హిందీ డబ్బింగ్‌ రూపంలో హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయి. తెలుగు ప్రేక్షకులకే కాదు. డిఫరెంట్‌ లాంగ్వేజెస్‌లో కూడా సెట్‌ అయ్యే కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ మూవీ. ఇలాంటి కాన్సెప్ట్‌ మూవీస్‌ ఎక్కడైనా ఆదరణను పొందుతాయి. దర్శకుడు సంతోష్‌ కొత్తవాడైనా పదేళ్ల దర్శకత్వంలో అనుభవం ఉన్నవాడిలా సినిమాను చక్కగా తెరకెక్కించారు. సుమంత్‌ తాను చేసిన మిగతా సినిమాలకు భిన్నమైన జోనర్‌ సినిమాను చేశారు. అలాగే ఆయన పాత్రను చాలెంజింగ్‌గా తీసుకుని నటించారు. తన నటనతో సుమంత్‌ పాత్రకు ప్రాణం పోశారు. ఆయనకు కృతజ్ఞతలు. సక్సెస్‌లో భాగమైన యూనిట్‌ సభ్యులకు, యూనిట్‌ను ఎంకరేజ్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అన్నారు.

చిత్ర దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి మాట్లాడుతూ – ”నన్ను నా కథను, కథనాన్ని నమ్మిన నిర్మాత బీరం సుధాకర్‌ రెడ్డిగారికి థాంక్స్‌. నా ఫేవరేట్‌ హీరో అయిన సుమంత్‌గారితోనే నా డెబ్యూ సినిమాను చేయడం చాలా ఆనందంగా ఉంది. కల నిజమైనట్లుగా అనిపిస్తుంది. సినిమా రిలీజ్‌ నుండి ఇప్పటి వరకు రోజు మార్చి రోజు థియేటర్స్‌కు నేను పర్సనల్‌గా వెళ్లాను. టికెట్‌ కౌంటర్‌ దగ్గర పరిస్థితిని కనుక్కుంటే, టికెట్‌ సేల్స్‌ గురించి వారు సంతృప్తికరమైన విషయాన్ని తెలిపారు. అలాగే థియేటర్‌ నుండి బయటకు వచ్చే ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి వాళ్లతో మాట్లాడాను. సినిమా చాలా బావుంది. డీసెంట్‌ అటెంప్ట్‌ అని వారు రెస్పాన్స్‌ ఇచ్చారు. కొత్త డైరెక్టర్‌గా నమ్మి కాన్సెప్ట్‌పై నమ్మకంతో సినిమా చేసిన సుమంత్‌గారికి థాంక్స్‌. కథను చక్కగా డెవలప్‌ చేసి ఇంప్లిమెంట్‌ చేశాం. ఇంకా ఈ సినిమాలో నటించిన ఈషా రెబ్బా, రవి, భద్రమ్‌, హర్షిణి తదితరులు చక్కగా నటించి తమ వంతు సహకారాన్ని అందించారు. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు” అన్నారు.

నటుడు జోష్‌ రవి మాట్లాడుతూ – ”డైరెక్టర్‌గారు నా కథను చెప్పి.. మిమ్మల్ని అనుకునే ఓ క్యారెక్టర్‌ రాసుకున్నానని చెప్పగానే ఓ నటుడిగా చాలా సంతోషమేసింది. ఇలాంటి పాత్ర దొరికినప్పుడు వదులుకోకూడదని మనసు పెట్టి పనిచేశాను. మా సినిమా ఇంత పెద్ద సక్సెస్‌ అయినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సుధాకర్‌రెడ్డిగారు ఇలాంటి సినిమాలు మరిన్ని తీసి నిర్మాతగా పెద్ద సక్సెస్‌ను సాధించాలని కోరుకుంటున్నాను. సుమంత్‌గారు ఎంత సక్సెస్‌ సాధించినా సెటిల్డ్‌గానే ఉంటారు. సినిమా ఈరోజుల్లో వారం రోజులను దాటి రన్‌ అవుతుందంటే, మేం సక్సెస్‌ సాధించినట్లుగానే భావిస్తున్నాను” అన్నారు.

చిత్ర నిర్మాత బీరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ – ”సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు. మా సినిమా తొలివారం సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగు పెట్టింది. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి కారణమైన మా హీరో సుమంత్‌గారికి ఎంటైర్‌ యూనిట్‌కు థాంక్స్‌” అన్నారు.

హీరో సుమంత్‌ మాట్లాడుతూ – ”నేను స్ట్రయిట్‌గానే మాట్లాడే వ్యక్తిని. సక్సెస్‌ అంటే … దాంట్లో మూడు రకాలుంటాయి. మొదటిది విపరీతంగా కలెక్షన్స్‌ సాధించి దుమ్మ దులపవచ్చు. మరో రకం.. విమర్శనాత్మకంగా చాలా మంచి పేరు రావచ్చు అవార్డులు పొందొచ్చు. ఈ కాలంలో నిర్మాతగారు పెట్టిన డబ్బు ఆయనకు తిరిగి వచ్చే సక్సెస్‌. ఆ రకంగా మా నిర్మాతగారు పెట్టిన డబ్బు ఆయనకు తిరిగి వచ్చేసింది. ఈ కాలంలో అలా రావడం అరుదుగా జరుగుతుంది. పదిశాతం సినిమాలు మాత్రమే పెట్టిన పెట్టుబడిని రాబట్టుకుంటున్నాయి. ఆ పదిశాతంలో నేను ఉండటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సినిమాకు పాజిటివ్స్‌, నెగిటివ్స్‌ ఉంటాయి. మా సినిమా అన్నింటినీ దాటి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడు సంతోష్‌కు చాలా మంచి భవిష్యత్‌ ఉంటుంది. సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ థాంక్స్‌” అన్నారు