సునీల్‌ ఉగాది కానుక!

Sunil
Sunil

సునీల్‌ ఉగాది కానుక!

క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపోందుతున్న తాజా చిత్రం ఉంగరాల రాంబాబు. ప్రస్తుతం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుని శరవేగంగా పోస్ట్‌ప్రోడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్‌ కిరిటీ మూవీస్‌ లిమిటెడ్‌ బ్యానర్‌ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్‌ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం టీజర్‌ ని ఉగాదిశుభాకాంక్షలతో విడుదల చేయనున్నారు. అతిత్వరలోనే ఆడియోని విడుదల చేసి, సమ్మర్‌ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. మా దర్శకులు క్రాంతి మాధవ్‌ తెరకెక్కిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం యెక్క టీజర్‌ ని ఉగాది పర్వదినాన విడుదల చేయనున్నాము. చాలా గ్యాప్‌ తరువాత సునిల్‌ తరహా కామెడి చూస్తారు. . మా చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. పోస్ట్‌ప్రోడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నవ్వించమే ద్యేయంగా అది కూడా అవుటాఫ్‌ కామెడి కాకుండా కథలోని కామెడి ని పోందు పరచి నవ్విస్తాము. ప్రకాష్‌రాజ్‌, పోసాని కష్ణమురళి, వెన్నెల కిషోర్‌ లు ముఖ్యపాత్రల్లో నటించారు. అతిత్వరలో ఆడియోని విడుదల చేస్తాము. ఫుల్‌ లెంగ్తె కామెడి మాత్రమే చేశాము. ఈ సమ్మర్‌ లో ఫుల్‌ కామెడి చిత్రం గా ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం అని అన్నారు.