సినీ నటుడు మహేశ్‌ బాబుకు జీఎస్టీ ఝలక్‌

mahesh babu
mahesh babu

రూ. 73 లక్షలు బాకీ, బ్యాంక్‌ ఎకౌంట్లు ఫ్రీజ్‌
హైదరాబాద్‌: సినీ నటుడు మహేశ్‌ బాబుకు జీఎస్టీ కమిషన్‌ ఝలక్‌ ఇచ్చింది. మహేశ్‌ బాబు 9 ఏళ్లుగా తన ఆదాయానికి తగిన పన్నులు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడుతున్నాడని గుర్తించింది. మొత్తంగా రూ. 73 లక్షలు బకాయిపడ్డట్లు గుర్తించిన జీఎస్టీ కమిషనర్‌ ఆయనకు సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్లను గురువారం ఫ్రీజ్‌ చేశారు. దీంతో పాటు నగరంలోని యాక్సిస్‌ బ్యాంకులో ఆయన పేరిట ఉన్న రూ. 43 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు జీఎస్టీ కమిషనర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.