సింగపూర్‌ సైమాకు

chiranjeevi-guest-for-siima-awards
సినిమాలకు దూరంగా రాజకీయ వ్యవహారాల్లో బిజీబిజీగా గడుపుతున్న సమయంలోనూ చిరంజీవి తరచుగా సినిమా వేడుకలకు హాజరయ్యేవారు.. ఇక్కడికొస్తే అదో ఆనందం అంటూ వేదికలపై మాట్లాడేవారు. అలాంటి చిరంజీవి ఇక సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక ఎందుకు మాత్రం ఫిల్మ్‌ ఫంక్షన్స్‌కి దూరమవుతారు? అందుకే సింగపూర్‌లో జరిగే సైమా వేడుకకి రమ్మని హ్వానించగానే ఆయన తన అంగీకారం తెలిపారు. ఈనెల 30 నుంచి వచ్చేనెల 1వ తేదీ దాకా రెండు రోజులపాటు జరగనున్న సైమా వేడుకలో దక్షిణాది పరిశ్రమలన్నీ పాల్గొంటున్నాయి.. ఈ ఏడాది వేడుకలకు చిరు హాజరుకానుండటంతో మరింత క్రేజ్‌ మొదలైంది..