సమానంగా నటిస్తే అడగాలి గానీ…

Rakul Preet Singh
Rakul Preet Singh

ప్రస్తుతం ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా ప్రతి హీరోయిన్‌ మదిలో మెదిలో ఒకే ఒక ప్రశ్న. హీరోతోపాటుగా హీరోయినుల కూడ సమానస్థాయిలో వర్క్‌ చేస్తున్నపసుడు ఈక్వల్‌గా రెమ్యూనరేషన్‌ ఎందుకు ఇవ్వరు? అని హాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా అందరూ హీరోయిన్లు ఈ విషయంపై కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఈ మధ్య టాలీవుడ్‌ కోలీవుడ్‌ భామలు కూడ వారి హోదా చాలా పెరిగిందని ఇప్పటికైనా ఆ వ్యత్యాసంలో మార్పులు రావాలని గట్టిగానే చెప్పారు.
ముఖ్యంగా కోలీవుడ్‌లో కూడ కొంత మంది భామలు పురుషాధిక్యం చాలా ఎక్కువైపోయిందని చెబుతున్నారు. మొన్న అమలాపాల్‌, జ్యోతిక వంటి తారలు ఇదే విషయాన్ని ప్రస్తావించి హాట్‌ టాపిక్‌ అయ్యేలా చేశారు. అయితే ఇపుడు తెలుగులో కూడ కొంత మంది తారలు ఈ విధంగా స్పందిస్తున్నారు. అయితే రకుల్‌ మాత్రం కొంచెం విభిన్నంగా మాట్లాడుతోంది. రెమ్యూనరేషన్‌ అనే ఒక్క విషయంలోనే కాదు. ప్రతి విషయంలోనూ పురుషాధిక్యత కన్పిస్తోంది. అందుకు కారణం. కూడ లేకపోలేదు. మన సినిమాలు ఎక్కువగా కథానాయకుల చుట్టే తిరుగుతాయి. ఒకవేళ కథానాయికలు ఆ బాధ్యతలు తీసుకున్నపుడు అందుకు తగ్గట్టుగా రెమ్యూనరేషన్‌ అడగటంలో తప్పులేదు. మన పాత్రలకు సమానంగా రెమ్యూనరేషన్‌ని తీసుకోవాలి. అది ఇప్పట్లో సదడన్‌గా వచ్చే మార్పు కాదు. కొంచెం కొంచెంగా వస్తుందని అంటూ ఫ్యూచర్‌లో హీరోయిన్లకు మంచి గుర్తింపు లభిస్తందని రకుల్‌ తన అభిప్రాయం వ్యక్తం చేసింది.