‘సంత’ తొలి షెడ్యూల్‌పూర్తి

A STILL FROM SANTA
A STILL FROM SANTA  

‘సంత’తొలి షెడ్యూల్‌పూర్తి

సూర్య భరత్‌ చంద్ర , శ్రావ్యారావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్‌ పతాకంపై శ్రీ జైవర్ధన్‌ బోయెనేపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘సంత.. మట్టి మనుషుల ప్రేమకథ అనేది ట్యాగ్‌టైన్‌. సంత నేపథ్యంలో ప్రేమకథగా ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైన్‌మెట్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈసినిమా వరంగల్‌లోని చిలుపూర్‌ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇటీవల తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది.. నిర్మాత జైవర్ధన్‌ మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్యంలో నడిచే ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోందన్నారు. తెలంగాణలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతున్నామన్నారు.తొలి షెడ్యూల్‌ పూర్తి అయ్యిందని, వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తిచేసి సినిమాను ప్రేక్షఖుల ముందుకు తీసుకొస్తామన్నారు.. మా టీమ్‌ అందరికీ మంచి పేరును తీసుకువస్తుందన్నారు.. కిన్నెర, మధుమణి, తాగుబోతు రమేష్‌ , రఘు కారుమంచి , జబర్దస్త్‌ ఫణి, ప్రసన్న, ఆర్‌ఎస్‌ నందా, దుర్గేష్‌ తదితరులు తారాగణం..