శ్రీ విష్ణు తిప్పరా మీసం ఫస్ట్‌లుక్‌

thipparaameesam
thipparaameesam

 శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ‘తిప్పరా మీసం సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. శ్రీవిష్ణు లుక్‌ చాలా కొత్తగా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.. పగిలిన అద్దాలు అతని క్యారరెక్టరరేజేషన్‌ చూపిస్తున్నాయి.. అసుర సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కృష్ణవిజ§్‌ు ఎల్‌ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో శ్రీ విష్ణుతో ఈయనకు ఇదే తొలి సినిమా యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోంది.. నిక్కి తంబోలీ, రోహిణి హీరోయిన్లుగా నటిస్తున్నారు.. అచ్యుత్‌రామారావు, బెనర్జీ, రవిప్రకాష్‌, రవి వర్మ, నవీన్‌ నేని, ప్రవీణ్‌, నేహాదేశ్‌పాండే తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.. సురేష్‌బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీ ఓం సినిమా బ్యానర్లపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.. వేసవిలో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.