వరల్డ్‌ రికార్డుల్లోకి గణేష్‌మాస్టర్‌

Award
Award

వరల్డ్‌ రికార్డుల్లోకి గణేష్‌మాస్టర్‌

డి2 టెలివిజన్‌ డాన్స్‌షో విన్నర్‌, మా టివి అవార్డు గ్రహీత , భారత్‌ ఆర్ట్స్‌ అకాడమీ ద్వారా గబ్బర్‌సింగ్‌ అవార్డును గణేష్‌ మాస్లరు అందుకున్నారు.. సినీకొరియోగ్రాఫర్‌గా పలువురు స్టార్‌ హీరోలు, పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, వెంకటేష్‌, నాగార్జున,. ఎన్టీఆర్‌, రామ్‌, నితన్‌, మంచు విష్ణు, అల్లరి నరేష్‌, నారా రోహిత్‌ , నిఖిల్‌, ఆది ,తదితర హీరోలతో పని చేశారు.. ఓసేయర్‌ రాములమ్మ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్‌గా పరిచయమైన ఆయన ఆ తర్వాత సుకుమార్‌, త్రివిక్రమ్‌, హరీష్‌శంకర్‌, గుణశేఖర్‌, వివి వినాయక్‌, పూరి జగన్నాధ్‌, కరుణాకరన్‌, నాగేశ్వరరెడ్డి సీనియర్‌ దర్శఖుడు ఇవివి వంటి దర్శకుల వద్ద పలు చిత్రాలకుకొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.. కాగా తాజాగా భారత్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఏటా అందించే బెస్ట్‌ టాలెంటెడ్‌ అవార్డు 2016-17 కి గణేష్‌ మాస్టారుకు దక్కింది.. ఎపి మాజీ సిఎం, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, భారత్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఇండియా ప్రతినిధి కెవి రమణారావు చేతులమీదుగా నమోదు పత్రాన్ని అందుకున్నారు.