లండన్ లో రకుల్ షాపింగ్

Rakul preet Singh
Rakul preet Singh

`వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ `తో కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్…..అతి కొద్ది కాలంలో నే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లోనే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా 3-4 సినిమాల్లో నటిస్తోందీ ముద్దుగుమ్మ. లవ్ రంజన్ తెరకెక్కిస్తోన్న ఓ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన రకుల్ నటిస్తోంది. గత నెల రోజులుగా ఆ చిత్ర షూటింగ్ లండన్ లో జరుగుతోంది. అయితే షూటింగ్ కు కొద్దిగా విరామం దొరకడంతో…రకుల్ ఎంచక్కా లండన్ వీధుల్లో  షాపింగ్  చేసింది. తన తల్లితో కలిసి అక్కడి రెస్టారెంట్లు – షాపింగ్ మాల్స్ లో సందడి చేసింది. చాలా రోజుల తర్వాత అమ్మతో కలిసి టైం స్పెండ్ చేశానంటూ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఆ షాపింగ్ ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.