రూ. 10 కోట్ల పారితోషికం!

Aishwarya rai
Aishwarya rai

మాజీ మిస్‌ వరల్డ్‌ ఐశ్వర్యారా§్‌ుకి ఇప్పటికే బోలెడంత ఫ్యాన్‌ బేస్‌ ఉందనేచెప్పాలి. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను కూడగట్టుకున్న ఈ నీలికళ్ల సుందరి. ఇప్పటికే తన రేంజ్‌ చాటుతూనే ఉంది. 2016లో ఏ దిల్‌ హై ముష్కిల్‌ తర్వాత కొంత బ్రేక్‌ తీసుకున్న ఐష్‌.ఇపుడు వరుసగా సినిమాలు చేస్తోంది. ఫన్నేఖాన్‌ అనే చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ మరోవైపు ఇంకా పేరు పెట్టని ఓ థ్రిల్లర్‌లో కూడ యాక్ట్‌ చేస్తోంది. వీటిఓపాటు 1967 నాటి రాత్‌ ఔర్‌ దిన్‌ రీమేక్‌లో కూడ నటించేందుకు యాక్సెప్ట్‌ చేసిందట. అప్పటో నర్గీస్‌దత్‌ చేసిన పాత్రను ఇపుడు ఐస్‌తో చేయించనున్నారు మేకర్స్‌.అయితే ఈసినిమా కోసం ఐశ్వర్య ఏకంగా రూ10 కోట్ల పారితోషికం ఇవ్వనున్నారని టాక్‌.