రికమండ్‌ చేయమని ఎవర్నీ అడగలేదు

           రికమండ్‌ చేయమని ఎవర్నీ అడగలేదు

SUDHEER BABU
SUDHEER BABU

ప్రేమ కథా చిత్రమ్‌, భలేమంచి రోజు , ..రీసెంట్‌గా సమ్మోహనం.తో సూపర్‌హిట్స్‌ సాధించిన హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో సుస్తిరమైన స్థానం ఏర్పరచుకున్న యంగ్‌ టాలెంటెడ్‌ హీరో సుధీర్‌బాబు.. సూపర్‌స్టార్‌ కృష్ణ అల్లుడిగా సినీరంగంలోకి ప్రవేశించినా తనకంటూ ప్రత్యేకతను సాధించుకుని టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ విశేషమైన గుర్తింపును సంపాదించుకున్నారు.. ఆయన హీరోగా నటిస్తూ ఆర్‌ఎస్‌ నాయుడు దర్శకత్వంలో శ్రీమతి రాణి పోసాని సమర్పణలో నిర్మించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే.. నభా నటేశ్‌ హీరోయిన్‌గా నటించిన ఈచిత్రం ఈనెల 21న విడుదల కాబోతోంది. ఈసందర్భంగా సుధీర్‌బాబుతో ఇంటర్వ్యూ విశేషాలు..

అందుకే నిర్మాతగా మారా: 8ఏళ్లు ఇండస్ట్రీలో హీరోగా ఉన్నా.. తొలిసారిగా ఒక డిఫరెంట్‌ డిజిగ్నేషన్‌తో (నిర్మాతగా) ప్రేక్షకుల ముందుకు వస్తున్నా.. ఇది నాకు చాలా డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌.. సుధీర్‌బాబు ప్రొడక్షన్‌లో నన్ను దోచుకుందువటే ప్రొడ్యూస్‌ చేశాను.. ఈ బేనర్‌ పెట్టటానికి రీజన్‌ ఏమిటంటే నేను ఇనీషియల్‌స్టేజ్‌లో చాలా మంది ప్రొడ్యూసర్లు ఆఫీసులకు తిరిగాను.. కథలు వింటూ టెక్నీషియన్లను, నిర్మాతలను ఒక ఛాన్స్‌ కోసం కలవటం జరిగింది.. 90శాతం డిజప్పాయింట్‌మెంట్‌ ఎదురయ్యేది చాలా మంది టాలెంట్‌ ఉన్నవారు ఇండస్ట్రీ వదిలి యుఎస్‌కి వెళ్లారు. కొంతమంది సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు వెళ్లారు. అపుడు నేను ఒకటి అనుకున్నా.. హీరోగా మంచి పొజిషన్‌ ఉండి నాకొక మార్కెట్‌ ఉంటే చిన్న సినిమాలు ప్రొడ్యూస్‌ చేద్దామని.. అది అప్పుడే డిసైడ్‌ అయ్యాను. లాస్ట్‌వన్‌ హాఫ్‌ ఇయర్‌ నుంచి ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్టచేసి ఈసినిమా ప్రారంభించా.

బేనర్‌ ఎప్పుడూ ఉంటుంది: బేసిగ్గా ఒక యాక్టర అనేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఫైడ్‌ఔట్‌ అయిపోవచ్చు.. కానీ ఒక బేనర్‌ అనేది తరతరాలుగా ఉండిపోతుంది.. రేపు మా పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యాక సినిమాలు తీస్తారు. వాళ్ల పిల్లలు తీయటానికి వీలుంటుంది.. ఉదాహరణకు సురేష్‌ ప్రొడక్షన్స్‌, గీతా ఆర్ట్స్‌ మాదిరిగా.. అదీ నా ఫీలింగ్‌.. అందుకే ఈ బేనర్‌ స్థాపించా.

కథ నచ్చటం కారణంగానే: ఒక యాక్టర్‌గా నేను 9 సినిమాలు చేశాను. అవన్నీ కొత్త ప్రొడ్యూసర్స్‌ , కొత్త డైరెక్టర్లుతోనే ఎక్కువ చేశాను. ఒక హీరో అన్నీ విషయాలు చూసుకోవాలి.. ఏదైనా సినిమా రిజల్ట్‌ తేడా వస్తే ప్రేక్షకులు, అభిమానులు ఆ హీరోకే సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ని అంటగడతారు.. ఈ టైమ్‌లోనే అని కాదు.. ఏదో ఒక టైమ్‌లో రెస్పాన్సిబిలిటీ ఫీలై ప్రొడ్యూస్‌ చేయాలి.. నా కెరీర్‌ మొత్తంలో 90 శాతం కొత్తవాళ్లతోనే చేశాను. న్యూకమర్‌్‌స ద్వారా కొత్తగా చాలా విషయాలు నేర్చుకున్నాను.. మంచి ఎక్స్‌పీరియన్స వచ్చింది.. కొత్తవాళ్ల పొటెన్షియాలిటీని క్యాచ్‌ చేయగలననే నమ్మకం ఉంది.. ఆ నమ్మకంతోనే ఈసినిమా స్క్రిప్టు నచ్చి టేకోవర్‌ చేశాను.

పాత్ర గురించి: ఈ చిత్రంలో కార్తీక్‌ క్యారెక్టర్‌ప్లే చేశాను. ఇది ఒక కామన్‌ పీపుల్స్‌ కత.. వారంలో 6 రోజులు మేం కష్టపడి 7వ రోజున లైఫ్‌ని సెలబ్రేట్‌ చేసుకోవాలి అనుకునేవిధంగా హీరో క్యారెక్టర్‌ ఉంటుంది.. మనందరికీ రిలేటెడ్‌గా, మన చుట్టూ పక్కల జరుగుతున్న కథలా ఉంటుంది.. పెద్దగా ఎమోషన్స్‌లేని ఒక బాస్‌లా కన్పించబోతున్నాను.. చాలా పోకస్డ్‌గా నా క్యారెక్టర్‌ ఉంటుంది.. నా గోల్స్‌ తప్ప వేరే ఎవర్నీ పట్టించుకోను. ప్రాక్టికల్‌ పర్సన్‌లా ఉంటాడు.. అలాంటి వ్యకిత ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు.. ఆ అమ్మాయి తన లైఫ్‌లోకి ఎంటర్‌ అయ్యాక తనకి తెలియకుండానే తాను ఎలా ఛేంజ్‌ అయ్యాడు? ఆ క్రమంలో తను ఏ సమస్యలను ఎదుర్కొన్నాడు..అనేది చిత్రం మెయిన్‌ కథ.. చాలా ఆసక్తికరంగా నా పాత్ర ఉంటుంది.

హీరోయిన్‌ గురించి: నభా నటేశ్‌ క్యారెక్టర్‌ కూడ చాలా రిలేటబుల్‌గా ఉంటుంది.. అన్నీ క్యారెక్టర్లు నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి.. లీడ్‌పెయిర్‌ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది.

మహేశ్‌తో సినిమా చేస్తా ..అయితే..
నేను చాలా షార్ట్‌టెంపర్‌ని..నాకు ఎమోషన్స్‌ ఎక్కువ..సినిమాలో గ్రాఫ్‌ చేంజ్‌ అవుతుంది.. మంచి కథ ఉంటే మహేష్‌గారతో తప్పకుండా మా బేనర్‌లో చేస్తాను. ఆ స్టేజ్‌కి రావాలి అంటే ఇంకా నేను మరికొన్ని సినిమాలు తీసి నిర్మాతగా ప్రవూవ్‌ చేసుకోవాలి.

ఇండిపెండెంట్‌గా ఎదగాలనుకున్నా:
మామయ్య మహేష్‌ రికమండేషన్స్‌తో కాదు.. పద్మాలయా , కృష్ణ ప్రొడక్షన్స్‌, ఇంది ప్రొడక్షన్స్‌, మహేష్‌ బేనర్‌ ఉన్నా కూడ నన్ను రికమండ్‌ చేయండి అని ఎవరినీ అడగలేదు.. నేను మొదట నుంచి ఇండిపెండెంట్‌గా ఎదగాలనుకున్నాను.. నాకు అలాగే ఇష్టం.. లేదంటే మా నాన్న పెట్టిన కంపెనీస్‌లో కూర్చుని సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చి పిల్లలతో సరదాగా గడపొచ్చు.. కానీ నాకు లైఫ్‌లో ఇంకా ఏదో సాధించాలన్న పట్టుదల నాలో ఉంది.. అందుకే హీరోగా , నిర్మాతగా చేస్తున్నాను.

తదుపరి చిత్రం: వీర భోగ వసంతరాయలు విడుదల కాబోతోంది.. పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ని ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నాను.. ఈచిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో హిందీ నిర్మాత అబుడెన్‌షి ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఆ చిత్రం ఉంటుంది.